నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. వ్యక్తిగత పూచీకత్తు సమర్పణ

సినీ నటుడు అల్లు అర్జున్  నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం , ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొట్టు మిట్టాడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

కండిషన్ బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.  ఇరు పక్షాల వాదనలు  విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరయ్యారు. పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు. . చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు   జడ్జి ముందు సమర్పించారు.