ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఏడాది పాటు ఉచిత డేటా..
posted on Jan 4, 2017 12:23PM

జియో ఇచ్చిన ఉచిత సర్వీసులకు బెంబేలెత్తిపోతున్న ఇతర నెట్ వర్కింగ్లు సైతం ఉచిత సర్వీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు ఆఫర్లతో ముందుకు వచ్చిన దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఏడాది పాటు 4జీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. 4జీ హ్యాండ్‌సెట్లు కలిగి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వినియోగించని వారు, అదే విధంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వినియోగిస్తూ కొత్త 4జీ హ్యాండ్‌సెట్లకు అప్‌గ్రేడ్ అయిన వారికి ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. జనవరి 4, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2017 మధ్య ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు ప్రతి నెలా 3జీబీ ఉచిత డేటాను డిసెంబర్ 31, 2017 వరకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్యాక్‌ల ద్వారా పొందవచ్చని తెలిపింది.