పలాస వద్ద రెండుగా విడిపోయిన ఫలక్ నూమా ఏక్స్ ప్రెస్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

సికింద్రాబాద్  హౌరా జంక్షన్  ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తృటిలొ పెను ప్రమాదం తప్పింది.    శ్రీకాకుళం సమీపంలో  ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అది కూడా సరిగ్గా మధ్యలో అంటే రైలు రెండు భాగాలుగా విడిపోయింది.  దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అయితే ప్రమాదాన్ని పసిగట్టిన రైలు డ్రైవర్ సకాలంలో స్పందించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.  శ్రీకాకుళం జిల్లా పసాల సమీపంలో ఈ సంఘటన జరిగింది.  ఈ ఘటనలో ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు.  సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రయాణ మధ్యలో బోగీలు విడిపోయిన సంఘటనను సీరియస్ గా తీసుకున్న రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.