అలేఖ్య పికిల్స్ వివాదం పై చెల్లి సుమ స్పందన
posted on Apr 8, 2025 3:45PM
.webp)
అలేఖ్య పికిల్స్ వివాదం గత నాలుగోజులుగా నలుగుతూనే ఉంది. అలేఖ్య బూతుపురాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అదే సమయంలో ముగ్గురు అక్కా చెల్లెల్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలేఖ్య ఆరోగ్యం క్షీణించి ఐసియులో చేరింది. దీని సంబంధించిన వీడియో ఒకటి అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో అలేఖ్య మీద ట్రోలింగ్ హద్దులు మీరిందని సుమ అంటున్నారు. అలేఖ్య ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి లేదని ఆమె అంటోంది. ట్రోలర్స్ తమ తండ్రి ఫోటోను కూడా వాడుకునే స్థితికి దిగజారిపోయారన్నారు. మూడు నెలల క్రితమే తమ తండ్రి చనిపోయిన దుఖంలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. మా ఇంట్లో మరో చావు చూడకూడదని అనుకుంటున్నాము అని ఆమె అన్నారు. ఆడపిల్లను టార్గెట్ చేశారని ఆమె రోదిస్తూ చెప్పారు. మమ్మల్ని బతకనివ్వరా మా అక్కకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ట్రోలర్స్ దేనని సుమ హైచ్చరించారు.