ఓడిపోయినందుకు హ్యాపీగా వివేక్..
posted on Nov 28, 2015 11:33AM
వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతితెలిసిందే. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. ఎన్నికలో ఓడిపోయినందుకు కనీసం బయటకి కూడా రాకుండా.. ఎలాంటి మీడియా సమావేశాల్లో కూడా పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ ఓడిపోయినందుకు ఒక్కరు మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అది ఎవరో కాదు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్..
అసలు వరంగల్ ఉపఎన్నికలో వివేక్ పోటీచేయాల్సి ఉంది.. కానీ మొదట వివేక్ పోటీ చేయడానికి నిరాకరించారు. ఆతరువాత కేంద్రం ఎలాగూ బుజ్జగించి ఆయన ఒప్పుకునే సరికి.. సరిగ్గా అదే సమయంలో సర్వే నారాయణ అడ్డుపుల్ల వేశారు. టీఆర్ఎస్ లోకి వెళదామనుకుంటున్న వివేక్ కు ఎలా టికెట్ ఇస్తారని కేంద్రాన్ని ప్రశ్నించడంతో కేంద్రం కూడా వివేక్ కు కాకుండా.. రాజయ్యకు టికెట్ కన్ఫామ్ చేసింది. ఆ తరువాత రాజయ్య కుటుంబంలో జరిగిన ఉందంతం అందరికి తెలసిందే. రాజయ్య కోడలు సారిక చనిపోవడం.. ఆతరువాత రాజయ్యను పోలీసులు అరెస్ట్ చేయడం.. రాజయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆ టికెట్ ను సర్వేకు ఇవ్వడం జరిగాయి. అయితే పోటీలో దిగిన సర్వే కూడా ఓడిపోయారు. దీంతో పోటీలో తను లేకుండా ఉన్నందుకు.. అంతేకాదు తన టికెట్ కు అడ్డుపడినా సర్వే ఓడిపోవడంతో వివేక్ ఫుల్ కుష్ లో ఉన్నారంట. అంతేకాదు దీనికి సంబంధించి వివేక ఫ్యామిలీ ఓ పార్టీకూడా చేసుకున్నారంట. మొత్తానికి సొంత పార్టీ సభ్యుడు ఓడిపోయినా వివేక్ చాలా సంతోషంగా ఉన్నారంటే.. సర్వే మీద బానే కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.