రైతులకు భారంగా మారిన ఎరువులు

పెరుగుతున్న ఎరువుల ధరలు రాష్ట్ర రైతాంగానికి భారంగా మారాయి. ఒకవైపు ఎరువులు తయారుచేస్తున్న సంస్థలు ఇష్టారాజ్యంగా వాటి ధరలను పెంచుతూ పోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని క్రమంగా తగ్గిస్తోంది. గతంలో రూ. 486 ఉన్న డిఎపి ప్రస్తుతం రూ. 1050 పెరిగింది. రూ. 350 ఉండే కాంప్లెక్స్ బస్తా ప్రస్తుతం రూ. 1050 కి విక్రయిస్తున్నారు. ఈ విధంగా రెండేళ్ళలో ఎరువుల ధరలు రెట్టింపుకు పైగా పెరిగాయి. దీనికితోడు ఎరువుల సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం మరింత కోత పెట్టింది. దీనివల్ల భాస్వరం ఎరువుపై కిలో కు రూ. 32 ఉండే సబ్సిడీ 21కి తగ్గింది. అదేవిధంగా పొటాష్ పై రూ. 26 నుంచి 24కు సబ్సిడీ కోత పడింది.పెంచిన ధరలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం సబ్సిడీల్లో విధించిన కోతలను లెక్కలోకి తీసుకుంటే రాష్ట్ర రైతాంగంపై సుమారు రూ. 600 కోట్ల మేర అదనపు భారం పడింది. ఒకవైపు ఎరువుల కంపెనీలు ధరలు పెంచుతున్నా మరోపైవు సబ్సిడీల్లో కోతలు పెడుతున్నా రైతుకు మద్దతుధర మాత్రం పెరగడం లేదు. దీంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.