టిడిపిని గెలిపించాలని కార్యకర్తలకు జూఎన్టీఆర్ పిలుపు
posted on May 28, 2012 11:42AM
ఎన్టీఆర్ 89వ జయంతి సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, కల్యాణ్ రామ్ సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ విలేకరులతో మాట్లాడాతు ఉపఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చరిత్ర ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని జూనియర్ అన్నారు. ఉప ఎన్నికల కారణంగానే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం వాయిదా పడిందని ఆయన చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టిడిపి అన్నారు. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని హరికృష్ణ మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై వ్యాఖ్యానించేందికు ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.