ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. ఇవాళ ఉదయం జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు హతమయ్యారు. మావోలు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా..దట్టమైన అటవీ ప్రాంతంలో మావోలు తారసపడ్డారు. వారు పోలీసులపై కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించగా, పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.