‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్చిట్..!
posted on Oct 15, 2024 9:59PM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంతో 2023లో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసిందని తేటతెల్లమైంది.
ఆంద్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకంలో సీమెన్స్ ప్రాజెక్ట్ నుండి నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు జగన్ ప్రభుత్వం ఆరోపించి చంద్రబాబును అరెస్టు చేసి, 53 రోజులు జైల్లో వుంచింది. ఇప్పుడు ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇవ్వడంతో నిధుల మళ్ళింపుకీ, చంద్రబాబుకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని తేలింది.