సైబర్ క్రైమ్ (14c) బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక!
posted on Oct 15, 2024 7:49PM
కథానాయిక రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెందిన ‘సైబర్ దోస్త్’ విభాగం ప్రకటించింది. ఈ మేరకు రష్మిక కూడా వీడియో విడుదల చేశారు. "కొద్ది నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో కొంతమంది క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అది సైబర్ క్రైమ్. ఆ చేదు అనుభవం తర్వాత నేను సైబర్ క్రైమ్‌కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నా. దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలని అనుకున్నాను. ఇప్పుడు మీ ముందుకు ఓ విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కి (14C) నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అధ్వర్యంలో సైబర్ దోస్త్ పనిచేస్తుంది. సైబర్ క్రిమినల్స్ మనల్ని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం అలర్ట్.గా వుండటమే కాదు.. అలాంటి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి క్రైమ్స్జరగకుండా చూడాలి. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నేను ఇలాంటి నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడతాను" అని రష్మిక అన్నారు.