ఎబోలా లేదోచ్...

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వ్యాధి వైరస్ ఇప్పుడు హైదరాబాద్‌కి కూడా చేరుకుందా? హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస ప్రసాద్ (53) అనే వ్యక్తి నైజీరియాలోని ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను నవంబర్ 21వ తేదీన నైజీరియా నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చాడు. అయితే ముంబై విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యగా అతనికి ఎబోలా పరీక్షలు నిర్వహించారు. అతనిలో ఎబోలా వైరస్ లేదని రిజల్డ్ రావటంతో అతన్ని దేశంలోకి రావడానికి అనుమతించారు. అతను అక్కడి నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాడు. అయితే నవంబర్ 24వ తేదీ నుంచి అతను తీవ్ర జ్వరంతో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతనిలో ఎబోలా లక్షణాలు ఉన్నాయని అనుమానించిన డాక్టర్లు అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు శ్రీనివాస ప్రసాద్‌ని ప్రత్యేక పర్యవేక్షణలో వుంచారు. శ్రీనివాస్ నుంచి రక్తం నమూనా సేకరించి ఎబోలా పరీక్షల నిమిత్తం ఢిల్లీకి పంపించారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ఫలితాల ప్రకారం అతనికి ఎబోలా సోకలేదని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.