ఒంగోలులో కంపించిన భూమి

ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం (సెప్టెంబర్ 25) తెల్లవారు జామున భూమి కంపించింది. అర్థరాత్రి రెండు గంటలు దాటిన తరువాత దాదాపు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదు.  

 అయితే భూమి కంపించడంతో నిద్ర నుంచి ఒక్కసారిగా మేల్కోన్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఈ భూకంప తీవ్రత ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం స్వల్పంగా భూమి కంపించిన మాట వాస్తవమేననీ, అయితే ఎటువంటి భయాందోళనలూ అవసరం లేదనీ చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu