ఏపీకి అతి భారీ వర్ష సూచన
posted on Sep 24, 2025 11:19AM

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్యబంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుభందంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడుగా ఉత్తర బంగాళా ఖాతంలో గురువారం (సెప్టెంబర్ 25) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అంతే కాకుండా ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని హెచ్చ రించింది. వీటి ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పోతే బుధవారం (సెప్టెంబర్ 24) శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయనీ పేర్కొంది. వచ్చే ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.