అయోధ్యలో మాంసాహార ఫుడ్ డెలివరీపై నిషేధం

అయోధ్యలో ఆన్ లైన్ లో మాంసాహార ఫుడ్ డెలివరిపై అధికారులు నిషేధం విధించారు. అయోధ్య రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో  మాసాహార ఫుడ్ డెలివరీని పూర్తిగా నిషేధించామనీ, ఆ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందనీ  అధికారులు తెలిపారు.

 పవిత్ర పుణ్యక్షేత్రం పంచకోశి పరిక్రమ పరిధిలోని ప్రాంతాల్లోకి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మాంసాహారాన్ని సరఫరా చేస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య లోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వాటి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు.

అయితే నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ ల  ద్వారా పర్యాటకులకు నాన్-వెజ్ ఫుడ్ అందుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆన్‌లైన్ నాన్-వెజ్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటళ్లు, హోమ్‌స్టేలు కూడా ఈ నిబంధనలు పాటించాలని  నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu