మయన్మార్ లో భారీ భూకంపం

మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. మయన్మార్ తో పాటు థాయ్ ల్యాండ్ లో కూడా భూమి కంపించింది. మయన్మార్ లో  సంభవించిన భూకంపం కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్ఠం సంభవించినట్లు సమాచారం. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి.  

ఇక థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఇక్కడా పలు భవనాలు కుప్పకూలాయి. సహాయ కార్యక్రమాల కోసం సైన్యం రంగంలోకి దిగింది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ  చేశారు. ఇక భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.