చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం.. ఆనంద్ మహీంద్రా
posted on Apr 1, 2025 6:47AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయనీ, ఆయన ఆచరణ అంతకంటే గొప్పగా ఉంటుందనీ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.
పారిస్‌లో తమ రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ ఒక వీడియోను కూడా ఆ పోస్టుతో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరడం, వరల్డ్‌వైడ్‌గా తగిన గుర్తింపు లభించడం ర్తిదాయకమని పేర్కొన్నారు.