లక్ష్మి పార్వతికి హైకోర్టులో షాక్
posted on Apr 1, 2025 11:33AM
వైకాపా నేత లక్ష్మి పార్వతికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని 2009లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరి విల్లు చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటి సివిల్ కోర్టు చట్టబద్దంగా వ్యవహరించలేదని పేర్కొంది. విల్లుపై సాక్షి సంతకం చేసిన జె. వెంకట సుబ్బయ్య వారసుడు జెవి ప్రసాదరావు సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. సాక్షి సంతకం చేసిన ప్రసాదరావు కనీసం తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కూడా సిటి సివిల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదని అయినప్పటికీ దిగువ కోర్టు ప్రసాదరావు నోటి మాట ఆధారంగా సాక్షిగా పరిగణలో తీసుకోవడం చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానింది. క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై లక్ష్మిపార్వతికి అనుకూలంగా రావడాన్ని ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ లు హైకోర్టులో సవాల్ చేశారు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారి చేసింది.