సర్పంచ్‌గా గెలిచాడు...హామీలు నెరవేర్చారు

 

సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామం లో ఆడ బిడ్డ జన్మిస్తే బంగారు తల్లి అనే పథకం కింద 5116/- ఇస్తానని, ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ను తుచా తప్పకుండ, హాస్పిటల్ కి వెళ్లి మరి హామీ నెరవేర్చిన సన్నివేశం మహబూబాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రి మిట్ట శివారు బందలగడ్డ కు చెందిన బానోతు గణేష్ భార్య సింధు ఆడ శిశువుకు జన్మనివ్వగా రూ. 5116 కానుక ఇచ్చి సర్పంచ్ పున్నమి చందర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆడబిడ్డ జన్మిస్తే రూ. 5116 ఇస్తానని హామీ ఇచ్చిన పున్నం చందర్ మర్రిమిట్ట గ్రామ పరిధిలోని బందల గడ్డ తండాకు చెందిన బానోతు సింధు బంగారు తల్లి జన్మించినట్లు తెలుసుకున్న సర్పంచ్ మానుకోటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి చిట్టి తల్లికి రూ. 5116 చేతికి అందించారు.

గ్రామం లో ఎవరైనా చనిపోతే టెంట్, కుర్చీలు అంటూ ఖర్చు కాకుండా... వాటి ఖర్చు కూడా సర్పంచ్ గా గెలిచాక... తానే భరిస్తా అన్నారు. ఇటీవల గ్రామం లో ఒకరు మరణించగా... ఇచ్చిన హామీ ప్రకారం టెంట్, కుర్చీలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు.

మేనిఫెస్టో లో 10 హామీలు... రెండు అమలు

* ​గ్రామ పంచాయితీ పరిధిలోని ఏ కుటుంబంలోనైనా జరిగే (ఆడ, మగ) పెళ్ళికి డి.జె. ఉచితంగా పెడతాను......
* ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా బంగారు తల్లి (ఆడపిల్ల) జన్మిస్తే 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను.
* ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా చావుకు కుర్చీలు మరియు టెంట్ ఉచితంగా పెడతాను.
* ​గెలిచిన నెల లోపు గ్రామ పంచాయితీలో గ్రామానికి సంబంధించిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తాను.
* ​గ్రామ పంచాయితీ పరిధిలో బస్తీ దవాఖానా మరియు గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తాను.......
* ​గ్రామ పంచాయితీ పరిధిలో అండర్ డ్రైనేజీలతో కూడిన సి.సి రోడ్లు పూర్తి చేసి స్వచ్ఛ గ్రామంగా ఏర్పాటు చేస్తాను........
* ​గ్రామ పంచాయితీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తాను.
* ​గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి ఒక్కరికి లేబర్ కార్డ్స్ చేపిస్తాను.
* ​మన గ్రామపంచాయితీ (బందాలగడ్డ, మర్రిమిట్ట, దస్రుతండ) ఇంటిపన్ను బిల్లులను మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను.
* ​మన మర్రిమిట్ట గ్రామపంచాయితీ శ్మశానవాటికకు కరెంటు మరియు నీళ్ళ సరఫరా చేయించగలనని హామీ ఇస్తున్నాను పున్నం చందర్ సర్పంచ్ మర్రిమిట్ట తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu