ఈ గాడిద రేటుతో..సెకండ్ హ్యాండ్ బెంజ్ కొనొచ్చు
posted on Jun 9, 2017 5:28PM

గాడిద రేటు ఎంత ఉంటుంది రూ.50 వేలు...మహా అయితే లక్ష రూపాయలు లేదంటే కాస్త అటు ఇటుగా ఒక పదివేలు ఎక్కువ ఉండోచ్చు. అలాంటిది ఒక్క గాడిద ఖరీదు 10 లక్షలు ఉంటుందంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం. హర్యానాలోని సోన్‌పేట్ జిల్లాకు చెందిన టిప్పు అందరి గాడిదల్లాంటి గాడిద కాదట. దీనికి రోజుకు ఐదు కిలోల మినుములు, నాలుగు లీటర్ల పాలు, 20 కిలోల పచ్చిగడ్డి ఆహారం. అందుకు రోజుకు రూ.1000 ఖర్చవుతుందట. మరి ఆ రేంజ్‌లో మెపుతుంటే బలిష్టంగా తయారవ్వదా..ఆ ఊళ్లో ఇదో సెలబ్రిటీ..ఈ గాడిదను యజమాని ప్రతీ రోజు సాయంత్రం వాకింగ్‌కు కూడా తీసుకెళతాడట. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాడిదల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొనేందుకు ముందు కు వచ్చాడట అయితే దీనిని పది లక్షలకు రూపాయి తక్కువైనా అమ్మను అని ఖరాఖండిగా చెప్పేశాడట.