అమ్మవారి ముందు కూతురిని చంపి.. శవాన్ని రేప్ చేయించారు
posted on Jun 9, 2017 5:16PM

మనిషి డబ్బు కోసం ఎంత నీచనికైనా తెగించిన ఎన్నో ఉదంతాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఆ డబ్బు సంపాదించేది ఎవరి కోసం తన భార్యా, బిడ్డల కోసమే కదా..! అలాంటిది డబ్బు కోసం తల్లిదండ్రులే తమ కూతురిపై క్షుద్రపూజలు చేయిస్తే. చెప్పడానికి మాటలు కూడా రాని ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగింది. మహావీర్ ప్రసాద్, పుష్ప భార్యభర్తలు వీరికి కవిత అనే 15 ఏళ్ల కుమార్తె ఉంది. మహావీర్ కన్నౌజ్‌లో ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే కొద్దిరోజుల నుంచి ఇతను వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నాడు. కాలం గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర నిరాశలో కృంగిపోయిన మహావీర్‌కు అతని డ్రైవర్ కృష్ణశర్మ ఒక సలహా ఇచ్చాడు.
తాను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలన్నీ తొలగుతాయని అయితే. మీ కుమార్తెను అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పాడు. ఇలా చేస్తే దేవీ దయతో 5 కేజీల బంగారం లభిస్తుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన వారిద్దరూ కూతురిని బలి ఇవ్వడానికి అంగీకరించారు. గత మంగళవారం అర్థరాత్రికి పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కూతురికి మత్తు మందు ఇచ్చి డ్రైవర్ కృష్ణశర్మ దగ్గరికి తీసుకెళ్లారు. అతను అమ్మాయికి కుంకుమ, పసుపు రాసి ఆత్యాచారం చేశాడు..అనంతరం ఆమె తల నరికి రక్తాన్ని సేకరించి అమ్మవారికి పూజలు చేశాడు. అయితే పూజతో ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన మహావీర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణశర్మను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెప్పుడు మాటలు నమ్మి కూతురిని పొగొట్టుకున్నందుకు వారు కన్నీరుమున్నీరవుతున్నారు.