పామును ప్రేమించిన యువతి..పెళ్లికి పెద్దల గ్రీన్‌సిగ్నల్
posted on Jun 9, 2017 5:40PM

అందమైన యువతి పాముతో ప్రేమలో పడటమా..? ఎక్కడైనా విన్నామా..? మహా అయితే సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో అలాంటి సంఘటనే జరిగింది. ఎక్కడో కాదు మన భారతదేశంలోనే. ఒడిశాలోని ఖుర్ధ్ జిల్లాలోని అతాల్ గ్రామంలో బిమ్ బాలా అనే మహిళ నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఎప్పటి నుంచో పాముల పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టలో ఒక పాము ఉంటోంది..ప్రతీ రోజు బయటకు వస్తుండటంతో ఆ పాము బిమ్ బాలాకు బాగా అలవాటైంది. దీంతో ఆమె రోజు పాలు తాగడం, ఆ తరువాత ఆమె ఒడిలో కొంతసేపు సేదదీరడం, ఆ తరువాత మళ్లీ పుట్టలోకి వెళ్లిపోవడం చేసేది. స్వతహాగా సాంప్రదాయాలను పాటించే మహిళ కావడంతో తమది జన్మజన్మల బంధమని భావించింది. దీంతో కొన్నాళ్టికి పాముతో ప్రేమలో పడింది. అది పక్కనబెడితే ఏకంగా పామునే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించింది. పాముతో పెళ్లికి రెడీ అయితే అడ్డు చెప్పాల్సింది పోయి ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్తులు కూడా దానికి వంత పాడారు. చాలా కాలంగా బిమ్ బాలాతో స్నేహంగా ఉంటున్నా..ఏనాడు కరిచే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. పాము కూడా ఆమెను ప్రేమిస్తోందని భావించి బిమ్ బాలాకు, పాముకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. అయితే ముహూర్త సమయానికి పాము పుట్టలోంచి బయటకు రాకపోవడంతో ఒక పాము బొమ్మతో వివాహం కానిచ్చేశారు.