రౌడీయిజం జరగడానికి వీల్లేదు...
posted on Mar 16, 2017 4:15PM
.jpg)
ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు అంశాలపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దమే జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం గుప్పించారు. అంతేకాదు అసెంబ్లీలో స్పీకర్ పోడీయం వద్దకు వెళ్లి వైసీపీ నేతలు ఆందోళన చేపట్టడంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వాళ్లు రౌడీయిజం కావాలని అనుకుంటున్నారని, అయితే ఇక్కడ రౌడీయిజం జరగడానికి వీలులేదని, ఈ విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి హోదాతో సమానమైన సాయాన్ని అందిస్తుందని.. తాను సభలో ప్రవేశపెట్టిన ‘కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాల తీర్మానం’ను ఆమోదించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని సీఎం అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది 2,533 కోట్ల రూపాయలు మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వం ఖర్చుపెట్టింది 2,924 కోట్ల రూపాయలని అన్నారు. అయితే, రెండున్నరేళ్లలో తాము ఖర్చుపెట్టింది. రూ. 3500 కోట్లని సమాధానం ఇచ్చారు.