వెన్నునొప్పి నుండి ఉపశమనం లభించాలంటే ఇలా చేయండి..!
posted on Sep 11, 2024 9:30AM
వెన్ను నొప్పి ఈ మధ్య కాలంలో చాలా సాధారణ సమస్యగా మారింది. జీవనశైలి, ఆహారంలో మార్పులు, అధిక శ్రమ లేదా అసలు శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుంది. మరీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది వెన్ను నొప్పి బారిన పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వెన్నునొప్పి నుండి ఉపశమనం లభించాలంటే కొన్ని టిప్స్ చాలా బాగా సహాయపడతాయి.
బలాసనం..
బలాసనాన్ని వేయడానికి వజ్రాసనం భంగిమలో కూర్చోవాలి. మోకాళ్ల మీద నుండి ముందుకు వంగి చేతులను ముందుకు చాపాలి. తలను నేలకు ఆనించి ఈ పొజిషన్ లో 20 సెకెన్లు ఉండాలి.
మార్జాలాసనం..
మార్జాలాసనం వేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. చేతులు, మోకాల్ల పై కూర్చోవాలి. మణికట్టును భుజాల కింద, మోకాళ్లను తుంటి కింద ఉంచాలి. వీపును నిటారుగా ఉంచి పిల్లి రిలాక్స్ అయ్యే పొజిషన్లో వీపును కిందకు వంచి తలను పైకెత్తాలి. ఈ పొజిషన్లో లోతుగా శ్వాస తీసుకోవాలి.
సేతు బంధాసనం..
నేలపై వెల్లికిలా పడుకోవాలి. నడుమును పైకి, కిందకు కదుపాలి. ఇలా చేస్తే వెన్ను నొప్పి నుండి తొందరగా ఉపశమనం ఉంటుంది. ఇదే పొజిషన్లో వీపును పైకెత్తి పాదాల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ సందర్భంలో శరీర బరువు తల మీద కూడా ఉంటుంది. ఛాతీ నుండి నడుము వరకు శరీరం పైకి లేచి ఉంటుంది. ఈ పొజిషన్లో 20 సెకెన్లు ఉండాలి.
*రూపశ్రీ.