పది రోజులుగా హాస్పిటల్లోనే డైరెక్టర్ వినాయక్.. ఏం జరిగింది..?

ఒకప్పుడు భారీ కమర్షియల్ సక్సెస్ లతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి. వి. వినాయక్ (VV Vinayak) కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఆయన దర్శకత్వంలో సినిమాలు రావడం సంగతి అటుంచితే.. కనీసం ఆయన కూడా బయట పెద్దగా కనిపించడం లేదు. దీంతో అసలు వినాయక్ కి ఏమైంది? అంటూ కొంతకాలంగా అందరూ చర్చించుకుంటున్నారు.

లివర్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లెమ్ తో వినాయక్ బాధపడుతున్నారని, అందుకే ఆయన పెద్దగా ఎక్కడా కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. తాజాగా వినాయక్ కి లివర్ కు సంబంధించి మేజర్ సర్జరీ జరిగిందని సమాచారం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ లో ఆయన దాదాపు పది రోజుల నుంచి ఉంటున్నారట. సర్జరీ సక్సెస్ అయ్యి, బాగా రికవర్ అవుతున్నారని.. త్వరలోనే వినాయక్ డిశ్చార్జ్ అవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.