తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
posted on Jul 26, 2024 9:41AM
వారాంతం సమీపిస్తుండటంతో తిరుమలలో రద్దీ ఒక్క సారిగా పెరిగింది. గురువారం (జులై 25) వరకూ సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ శుక్రవారం (జులై 26) నుంచి ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం (జులై 26) ఉదయం స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులకు దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. శని, ఆది (జులై 27, 28) వారాలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక గురువారం (జులై 25) శ్రీవారిని మొత్తం 61 వేల699 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 82 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది.