జగన్ కల నెరవేరదు
posted on Aug 26, 2015 5:30PM

ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి చంద్రబాబు చాలా కృషిచేస్తున్నారని చినరాజప్ప అన్నారు. కానీ జగన్ టీడీపీ ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కంటున్నారని.. అది ఎప్పటికీ జరగదని విమర్శించారు. అంతేకాదు ప్రత్యేక హోదాని అడ్డుపట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతు ప్రయోజనాల కోసం మాట్లాడితే.. జగన్ రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు మంత్రి దేవినేని ఉమ కూడా జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రినవుతానని పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్చందంగా భూములు ఇస్తుంటే జగన్ ఇప్పుడు వచ్చి రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. కొన్ని లక్షల ఎకరాలు కొట్టేసిన జగన్ ఇప్పుడు రైతుల భూములు లాక్కుంటున్నారంటూ ఆరోపించడం విచిత్రంగా ఉందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత జగన్‌కు లేదు’ అని ఆయన విమర్శించారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ జగన్ విజయవాడలో ఈ రోజు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.