కేసీఆర్ జాగీరా అది

 

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. తన ఇష్టమొచ్చినట్టు చేయడానికి తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా అని మండిపడ్డారు. తన ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు.. అందరూ నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఇది తన ఇల్లు కాదు ప్రజాస్వామ్యమని ఎద్దేవ చేశారు. ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తానని కేసీఆర్ అంటున్నారు.. కేసీఆర్‌దేమైనా రాజరికమా..? లేక జమిందార్ పాలనా? అని నిలదీశారు. ప్రాజెక్టులపై అఖిలపక్షంతో మాట్లాడి.. చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయినా ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులపై నిందిస్తున్నారు.. మరి కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడ లేదని.. అప్పుడు గుర్తుకురానివి ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని అన్నారు. రైతులపట్ల నిర్లక్షం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ రానున్న రోజుల్లో అందుకు తగినమూల్యం చెల్లించుకోక తప్పదని పొన్నం వ్యాఖ్యనించారు.