దేవినేని నెహ్రూ టీడీపీ ఎంట్రీ.. నేడో, రేపో క్లారిటీ..
posted on Aug 29, 2016 2:52PM
రాజకీయ ప్రబుద్దుడు దేవినేని నెహ్రూ ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతారన్న వార్తలు గత కొద్దిరోజుల నుండి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నేడో రేపో ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే దేవినేని నెహ్రూని పార్టీలోకి రప్పించడానికి టీడీపీ నేతలు పలు చర్చలు జరిపారు... అంతేకాదు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ కూడా ఆయన నివాసంలోనే చర్చలు జరిపారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో కూడా ఆయన ఫోన్లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన ఈరోజు లేదా రేపు చంద్రబాబుతో ప్రత్యక్షంగా కలుసుకొని ఆయనతో చర్చించి ఆతరువాత ప్రకటించనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ పార్టీలోకి దేవినేని చేరిక ఖాయమని, అందుకు అధినేత నుంచి కూడా అంగీకారం వచ్చిందని తెలిపాయి. ఆయన తన కార్యకర్తలు, అభిమానులతో పార్టీ మారే విషయమై ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ పార్టీలో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా జంప్ అవ్వాడనికి సిద్దంగా ఉన్నారు. ఉన్న సీనియర్ నేతల్లో దేవినేని నెహ్రూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరితే, విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నేతను కోల్పోయినట్టే.