పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తమ ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు ప్రధాని మోదీ, సీఎంచంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు.

స్వారత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. "అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం" అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  పిఠాపురం మున్సిపాలిటీకి రూ.3 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న హామీల అమలును ముందుకు తీసుకెళ్లున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu