ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బ‌లాదూర్ - మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.

ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల పేరుతో సాగుతోన్న మ‌ద్యం దందాలో బ్రాండ్లుదే కీల‌క‌పాత్ర‌. ఊరూ పేరు లేని మ‌ద్యం బ్రాండ్లు దాదాపు 2725 ర‌కాల‌వి అమ్ముతున్నారు. వీటిలో 70 శాతం బ్రాండ్ల పేర్లు గ‌తంలో ఎవ‌రూ విన‌లేదు. ఇవ్వ‌న్నీ ఎవ‌రు త‌యారు చేస్తున్నారు. ఎందుకు త‌యారు చేస్తున్నారు. ఎలా త‌యారు చేస్తున్నారు? ఇదో పెద్ద స్కాం అంటారు మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.  ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అంటారాయ‌న‌. ప్ర‌భుత్వ మ‌ద్యం,  వైన్‌షాపుల్లో అమ్మేది మ‌ద్యం కాదు విషం అని లేబ‌రేట‌రీ నివేదిక‌ల్లో తేల‌డంతో ఏపీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. 
మీకు గుర్తుందా అప్ప‌ట్లో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా వున్న సోము వీర్రాజు ఏమ‌న్నారంటే ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే కేవ‌లం 50 రూపాల‌కే చీప్ లిక్క‌ర్ ఇస్తామ‌న్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు.
సి.ఎం. జ‌గ‌న్ ఏమో ప్ర‌భుత్వ మ‌ద్యాన్ని పేద‌లు కొన‌లేనంత రేట్లు పెంచానంటున్నారు. ఎందుకంటే అది మ‌ద్య‌నిషేధంలో భాగ‌మ‌ని క‌ల‌రిచ్చారు. 
తాజాగా మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమారెడ్డి రాజంపేట ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అంటూ జే సిండికేట్ గుట్టు ర‌ట్టు చేశారు. దీంతో
ఏపీ రాజ‌కీయాల్లో లిక్క‌ర్ హాట్ హాట్‌గా మారింది.  
ఏపీలో దేశంలోనే మ‌రెక్క‌డా లేనివిధంగా 2725 బ్రాండ్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఊరూపేరూలేని వేలాది బ్రాండ్ల‌న్నీ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, అనిల్‌రెడ్డి సిండికేట్ ఉత్ప‌త్తులేన‌ట‌. జ‌గ‌న్ ఆయ‌న మ‌నుషులు త‌యారు చేస్తున్న ఈ మ‌ద్యం బ్రాండ్ల‌న్నీ..  కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కి విరుద్ధంగా వున్నాయ‌ని  కెమిక‌ల్ ప‌రీక్ష‌ల్లో తేలిపోయింది.  ఏపీ వైన్ షాపుల్లో కొనే బ్రాందీ, విస్కీల్లో సైనైడ్ వుంద‌ట‌.  ఓల్డ్ టైమ‌ర్ ,చాంపియ‌న్, రాయ‌ల్‌సింహ,  గ్రీన్ చాయిస్‌, సెల‌బ్రిటీ బ్రాండ్ల‌లో  ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలున్నాయ‌ని త‌మిళ‌నాడులోని ఎస్ జీ సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ల్యాబ్‌కి ప‌రీక్ష‌ల్లో తేలింది. ఈ మద్యంలో... బెంజోక్వినోన్‌, స్కోపారోన్‌, డైమితోక్సినామిక్‌ యాసిడ్‌,  పైరోగలాల్‌, వొల్కెనిన్‌,  వంటి రసాయనాలు కనిపించాయి. జ‌గ‌న్ బ్రాండ్లు తాగితే ఆయుష్షు తీరిన‌ట్టేన‌ని ల్యాబ్ రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. 
1. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలైతే ఏపీ మ‌ద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్‌...నో బిల్‌
2. మ‌ద్యం త‌యారీకి కావాల్సిన‌ ఇథైల్ ఆల్క‌హాల్ దేశంలో ఉత్ప‌త్తి లేదు.. విదేశాల నుంచి దిగుమ‌తీ లేదు
3. 10 రూపాయ‌లు క్వార్ట‌ర్ ఖ‌రీదైన ప్రెసిడెంట్ మెడ‌ల్ ని 150 అమ్ముతున్నారు
4. ఎక్స్‌ట‌ర్న‌ల్ యూజ్ మెడిసిన్స్ కోసం వాడే కెమిక‌ల్స్‌తోనే ఏపీ లిక్క‌ర్ త‌యారౌతోంది5.  మ‌ద్యం మ‌ర‌ణాల‌కు జె బ్రాండ్ మ‌ద్యమే కార‌ణ‌మ‌ని తేలిపోయింది.
మద్యం త‌యారీలో 1. ఈఎన్ ఏ, 2. లిక్విడ్ ఇథైల్ అనేవి కీల‌కం. అయితే వీటికి ప్ర‌త్యామ్నాయంగా జే సిండికేట్ సైనేడ్ తో పాటు ఇత‌ర ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు వాడి మ‌ద్యం త‌యారు చేసి ఏపీ ప్ర‌భుత్వ షాపుల్లో అమ్ముతున్నారు. 
ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ) ఎలా త‌యారు చేస్తారంటే..... 
బియ్యం, బియ్యం నూకలు, మొక్క‌జొన్న‌ ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా తొలుత రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ తయారు చేస్తారు. దాన్ని మరింత శుద్ధి చేస్తే ఈఎన్‌ఏగా మారుతుంది. స్పిరిట్‌లో ప్యూరిటీ 66శాతం దాటితే ఈఎన్‌ఏగా పిలుస్తారు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం కనీసం 66 శాతం ప్యూరిటీ ఉన్న ఈఎన్‌ఏతోనే మద్యం తయారు చేయాలి. ఆ తర్వాత ఈఎన్‌ఏకు నీరు, రంగు, ఫ్లేవర్‌, మాల్ట్ లాంటివి కలిపి మద్యం ఉత్పత్తి చేస్తారు. 
కానీ...జ‌గ‌న్  బ్రాండ్లను ఈఎన్‌ఏ కాకుండా నేరుగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తోనే ఉత్పత్తి చేస్తున్నారు. 
ఇక మ‌ద్యం త‌యారీలో కీల‌కమైన లిక్విడ్ ఇథైల్ ఆల్క‌హాల్ ను ఎలా త‌యారు చేస్తున్నారో చూస్తే.... 
జ‌గ‌న్ సిండికేట్‌ ఉత్ప‌త్తి చేస్తోన్న ల‌క్ష‌ల లీట‌ర్ల మ‌ద్యానికి స‌రిప‌డా 
ఇథైల్ ఆల్క‌హాల్ రాష్ట్రంలో ఉత్ప‌త్తి కాలేదు. దేశంలోనూ లేదు. 
ఇథైల్ ఆల్క‌హాల్ ఎంత దిగుమ‌తి చేసుకున్నారు అని ఒక స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త అడిగితే అస‌లు దిగుమ‌తి చేసుకోలేద‌ని సంబంధిత శాఖ నుంచి స‌మాచారం అందింది. 
మ‌ద్యం తయారీ అత్య‌వ‌స‌ర‌మైన ఇథైల్ ఆల్క‌హాల్ దేశీయంగా ఉత్ప‌త్తి లేకుండా, 
దిగుమ‌తి చేసుకోకుండా ఏపీలో ప్ర‌మాద‌క‌ర బ్రాండ్ల త‌యారీకి వాడుతున్న ర‌సాయ‌నాలు ఏంట‌నేది ఎస్ జీ ఎస్ ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో తేట‌తెల్ల‌మైంది. 
ఇథైల్ ఆల్క‌హాల్‌కి బ‌దులుగా 
ఎక్స్‌టెర్న‌ల్ మెడిసిన్ త‌యారు చేసేందుకు వాడే కెమిక‌ల్స్‌ని మ‌ద్యం త‌యారీకి వాడుతున్నారు. 
ఆయిట్మెంట్లు, టాబ్లెట్లు, క్రీములు త‌యారు చేసుకునేందుకు త‌మ ఫార్మా కంపెనీలు దిగుమ‌తి చేసుకున్న కెమిక‌ల్స్‌నే మ‌ద్యం తయారీకి వాడేస్తున్నారు. 
గ‌తంలో మండ‌లానికి ఓ మ‌ద్యం సిండికేట్‌వుండేది. ఇప్పుడు రాష్ట్ర‌మంతా జ‌గ‌న్ అనుచ‌రులు  సిండికేట్‌గా ఏర్ప‌డ్డారు. అమ్మేది ప్ర‌భుత్వం పేరుతోనైనా, త‌యారు చేసేది మాత్రం జె. సిండికేట్ డిస్టిల‌రీల్లోనే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం. 
ఎస్పీవై  డిస్టలరీ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో వుంది. ఇందులోంచి  ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై చాంపియన్ విస్కీ, ఎస్పీవై, సెలబ్రిటీ బ్రాందీ,  వైట్ టస్కర్, దారు హౌస్ బ్రాండ్లు త‌యారు చేస్తున్నారు. 
మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన  అదాన్, లీల డిస్టలరీలు  సుప్రీం విస్కీ, బ్రిలియంట్ విస్కీ త‌యారు చేసి ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల ద్వారా అమ్ముతున్నారు. 
క‌మీష‌న్లు ఇచ్చుకోలేని డిస్టిల‌రీలు జ‌గ‌న్ అనుచ‌రుల‌కే లీజుకిచ్చేశారు. 2 వేల‌కి పైగా బ్రాండ్ల‌న్నీ వీరే త‌యారు చేస్తూ అమ్ముతున్నారు. అన్నీ క్యాష్ ట్రాన్సాక్ష‌న్స్‌, నో బిల్‌. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుపుతుంటే ఏపీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల‌లో ఓన్లీ క్యాష్. నో బిల్‌. అతి పెద్ద దోపిడీ ఇలా సాగుతోంది. 
టిడిపి హ‌యాంలో ఏడాదికి 6 వేల‌కోట్లు... అమ్మాకాలుండేవి. వైసీపీ ప్ర‌భుత్వం 20 వేల కోట్ల మ‌ద్యం ఏడాదికి అమ్ముతోంది. సిండికేట్ త‌యారుచేసిన ఈ మ‌ద్యం అమ్మ‌కాల నుంచి నెల‌కి 200 కోట్లు నేరుగా జ‌గ‌న్ కు అందేలా 
వైఎస్ అనిల్ రెడ్డి చూసుకుంటార‌ట‌.  ఏపీ లిక్క‌ర్ స్కాం సంబంధించిన కీల‌క ఆధారాలు త‌న వ‌ద్ద వున్నాయ‌ని మాజీ సి.ఎం. చెబుతున్నారు. ఈ స్కాంలో మిథున్‌రెడ్డి పాత్ర గురించి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఏం చెబుతారోన‌నే ఉత్కంఠ‌త నెల‌కొంది.