వైసీపీ తప్పుడు ప్రచారం: చంద్రబాబు 

ఎపిలో పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో  ఆ పార్టీ అధ్యక్షుడు స్పందించారు. 
  తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు, జగన్‌రెడ్డి బతుకే ఓ ఫేక్ బతుకని దుమ్మెత్తి పోశారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. పెన్షన్లు పంచవద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఎక్కడా ఆదేశించలేదని తెలిపారు.

పెన్షన్ల విషయంలో జరుగుతున్నది అంతా పెద్ద రాజకీయ కుట్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ప్రజలు ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచి, ఆంక్షలు ఎత్తివేసి ఇంటివద్దే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.