జనసేన తీర్థం పుచ్చుకున్న మండలి బుద్ద ప్రసాద్..  పొత్తులో భాగంగా అవనిగడ్డ నుంచి పోటీ 

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని నేతలు పక్క పార్టీలోకి చేరి టికెట్ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఇద్దరు జనసేనలో చేరిపోయారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు జనసేన పార్టీలో చేరారు. మరోవైపు జనసేన తరుఫున మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పాలకొండ, అవనిగడ్డ స్థానాల కోసం జనసేన గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పాలకొండ టికెట్ నిమ్మక జయకృష్ణకు, అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

పొత్తులో భాగంగా అవనిగడ్డ, పాలకొండ స్థానాలు జనసేనకు వెళ్లాయి. దీంతో గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలలో పలువురు పేర్లతో జనసేన సర్వేలు చేయించింది. 21 స్థానాల్లోనూ కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్.. సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆ రెండు స్థానాలకూ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలైన వీరికి అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోం