హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్ శాతం

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.తెలంగాణలో ఇవాళ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే… హైదరాబాదీలు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. అసలు ఓటు వేయడానికి నగరవాసులు కలవడం లేదు. ఇప్పటికే చాలాసార్లు హైదరాబాదీలు పోలింగ్ విషయంలో ప్రత్యేకంగా వార్తాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు ముందుకు రావడం లేదని.. సీటీ ప్రజలకు ఎందుకింత బద్ధకం అని.. ఎన్నికలు జరగినప్పుడల్లా మీడియా అనేక రకాల కథనాలు కూడా ఇస్తుంది. అటు ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకుల, సెలబ్రిటీలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. అందరు కదిలి ఓటు వేయాలని.. మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక ఎన్నికల అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు కూడా ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా హైదరాబాదీల తీరు మాత్రం మారడం లేదు. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇదే తంతు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌లోనే తక్కువగా పోలింగ్ శాతం నమోదు అవుతుంది. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా… ఇప్పటివరకు పోలీంగ్ శాతం తక్కువగా  నమోదు అవ్వడంపై… ఎన్నికల అధికారులు సైతం షాక్ అవుతున్నారు. అయితే హైదరాబాద్‌లో చాలామంది ఏపీ ప్రజలు ఉంటారు. చాలామందికి ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉంది. దీంతో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. చాలామంది ఓటు కోసం ఏపీకి క్యూ కట్టారు. అలా కొందరు వెళ్లినా కూడా… కనీస పోలింగ్ అయినా నమోదు కావాలి. కానీ.. అలా జరగలేదు. సిటీ జనం ఇంటి గడప దాటడానికి ఇష్టపడటం లేదు. దీంతో హైదరాబాద్‌లో పోలింగ్ మందకొడిగా సాగింది. జంట నగరాల్లో మూడు పార్లమెంట్ స్థానల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయ్యింది.