కూతుర్ని అమ్మేశాడు... భార్యనీ అమ్మేందుకు సిద్ధపడ్డాడు
posted on Jun 28, 2018 12:12PM

మానవత్వం మంటగలిసిపోతోంది అని మొత్తుకునే మాటలకి ఈమధ్య చాలా ఉదాహరణలే కనిపిస్తున్నాయి. కావాలంటే ఇది చూడండి. అతనో ఆటోడ్రైవర్. ఆదాయం అంతంతమాత్రమే! దానికి తోడు తాగుడు అలవాటు. దాంతో ఒకదాని తర్వాత ఒకటిగా అప్పులు చేశాడు. ఆ అప్పుల మీద వడ్డీలు కలిసి మోపెడయ్యాయి. ఆ అప్పులను తీర్చేందుకు అతను ఓ దారుణమైన ఉపాయాన్ని ఆలోచించాడు. తన కూతురు పెద్దమనిషి కాగానే 1.5 లక్షలకు బదులుగా అప్పగిస్తానని ఓ పెద్దమనిషితో ఒప్పందం ఏర్పరుచుకున్నాడు. అంతేకాదు! తన భార్యని కూడా 5 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకునే ప్రయత్నాలలో ఉన్నాడు. విషయాన్ని పసిగట్టిన అతని భార్య పిల్లలతో కలిసి తన పుట్టింటికి పారిపోయింది. అక్కడ పోలీసులకు కంప్టైంట్ చేయడంతో ఈ దారుణం ప్రపంచానికి తెలిసింది. ఆ దంపతులకు ఇంకా ముగ్గురు కూతుళ్లు ఉండటంతో, వాళ్లందరినీ ఒకొక్కరిగా అమ్మే ప్రయత్నంలో ఉన్నాడని ఊహిస్తున్నారు.