విజయవాడకి కేసీఆర్- రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
posted on Jun 28, 2018 12:32PM

ఆంధ్రప్రదేశ్ అన్న మాట వినపడితే చాలు కేసీఆర్ భగ్గుమంటారన్నది చాలామంది అభిప్రాయం. కానీ అది ఉద్యమ సమయంలో... ఇప్పుడు ఆంధ్రాకు వెళ్లేందుకు కేసీఆర్ ఏమాత్రం జంకడం లేదు. అందుకే 2015లో అమరావతి శంకుస్థాపనకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ విజయవాడలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకునేందుకే కేసీఆర్ విజయవాడ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు మొక్కులు గుర్తుకువస్తాయనీ, విజయవాడలో ఉండే కమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకే ఆయన విజయవాడకు వెళ్తున్నారని దెప్పిపొడిచారు. నిజం అమ్మవారికే ఎరుక!