కాస్లీ కుక్క.. పట్టుకుంటే పదివేలు.. 

మనుషులు తప్పిపోతే యాడ్ ఇవ్వడం చూశాం .. అలాగే అతని ఆచూకీ చెప్పిన వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం చూశాం.. అయితే మీరు ఎప్పుడైనా కుక్క కోసం రివార్డ్ ప్రకటించడం చూస్తే ఉంటారు.. అయినా అయిన ఇప్పుడు ఉన్న రోజుల్లో అమ్మనాన్న, పెళ్ళాం పిల్లలు, తప్పిపోతే పట్టించుకుంటారో లేదో తెలీదు గానే కుక్కలు తప్పిపోతే తన ప్రాణం పోయినంతాగా ఫీల్ అవుతున్నారు కొంత మంది.. మనుషులకు దూరంగా.. జంతువులకు దగ్గరగా బ్రతుకుతున్నారు చాలా.. అదేంటని అంటే మనుషుల కంటే జంతువులు నిజాయితీగా ఉంటాయి అని మాట్లాడుతుంటారు. ఎవడో ఒక్కడు మోసం చేసినంత మాత్రాన అందరూ మోసం చేస్తారన్న గ్యారెంటీ లేదు కదా.. సరే ఈ విషయాన్నీ పక్కన పెడితే.. అసలు విషయం లోకి వెళ్దాం పదండి.. తాజగా ఓ  జాతికుక్క కిడ్నాప్ నగరంలో సంచలనంగా మారింది. గతనెల 17న కుక్క కిడ్నాప్ అయినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కుక్కను పట్టుకొనే పనిలో పడ్డారు పోలీసులు.
 
హైదరాబాద్‌లో ఓ జాతి కుక్క కిడ్నప్ తీవ్ర కలకలం రేపుతోంది. పారడైస్ సింథి కాలనీలో రోడ్ పై ఉన్న జాతి కుక్కను ఒక దుండగుడు ఎత్తుకెళ్లారు. గత నెల 17 న బ్లూ కలర్ R15 పై కుక్కను ఎత్తుకెళ్లినట్లు సాక్షి కనుగో అనే యువతి రాంగోపాల్ పెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షి వివిధ జాతి కుక్కలను పెంచుతూ అమ్మకాలు జరుపుతూ ఉంటుంది. కిడ్నాప్‌కు గురైన కుక్క ‘షిహ్ త్జు’ జాతి కి చెందిన రియో అని పోలీసులకు ఇచ్చిన కంప్లైట్‌లో ఆమె తెలిపింది.

మార్కెట్‌లో రియో విలువ సుమారు 45 వేలు డిమాండ్ ఉంటుందని వెల్ల‌డించింది. యువతి ఫిర్యాదు మేరకు పారడైస్ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించిన పోలీసులు గాలింపు చేపట్టారు. 25 రోజులు కావొస్తున్న రియో ఆచూకీ లభించలేదని తెలిసింది. కుక్క ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్ ప్రకటించారు సాక్షి. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని పారడైస్ పరిధిలో ఉన్నా సీసీటీవీ ఫుటేజ్  సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం అసలే కరోనా టైం ఖర్చులకు కూడా వెళ్లడం లేదు.. ట్రై చేసి చూడండి.. దొంగ దొరికితే ఆ పది వేలు మీ సొంతం.. పది వేలు అని అంత చీఫ్ గా తీసెయ్యకండి.. పది వేలు అంటే  ఒక నెల జీతం మాకెందుకులే అనుకుంటున్నారు.. ఒక చిన్న   చిన్న కుటుంబం రెండు నెలల ఇంటి ఖర్చులు.. మరింకెందుకు ఆలస్యం అదృష్టాన్ని పరీక్షించుకోండి..