ఆయనకి నెగిటివ్, కానీ ఆ ముగ్గురికీ మాత్రం పాజిటివ్

* శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన 
*  ఒకే కుటుంబం లో 'కరోనా' వైచిత్రి !

ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన వ్యక్తి ఢిల్లీలో పనిచేసేవాడు. ఇటీవలే ఢిల్లీ నుంచి పాతపట్నం వచ్చాడు. జిల్లాలో అడుగుపెట్టిన సమయంలో పరీక్ష చేస్తే నెగెటివ్ రిపోర్టు వచ్చింది. తాజాగా పీసీఆర్ టెస్టు నిర్వహించగా, నెగిటివ్ గానే వచ్చింది కానీ, ఆశ్చర్యకరంగా అతడి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.