అనంత కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు
posted on May 29, 2012 12:40PM
అనంతపురం అర్బన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. నాయకుల మధ్య విబేదాల కారణంగా కొందరు కీలక నేతలు ప్రచార కార్యక్రమాలకు నాయకులు దూరం అయ్యారు. తమకు టిక్కెట్టు రాలేదని అసంతృప్తిగా ఉన్న నేతలను రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా రెచ్చగొట్టారు. కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ విజయభాస్కరరెడ్డి ఇంటికి తేనీటి విందుకోసం వెళ్ళిన చిరంజీవి తనను మర్యాదగా విజయభాస్కరరెడ్డి పలకరిస్తే యూజ్ లెస్ ఫెలో అని చిరంజీవి వ్యాఖ్యానించడంతో వ్యవహారం చెడింది. సొంత మనుషులను అరిచినట్లు చిరంజీవి చిర్రుబుర్రులాడటం విజయభాస్కరరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ మంట మీద నాయకులుండగా మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోడ్డుషో కూడా నాయకుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ రోడ్డుషోలో డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా ప్రచారరథం నుంచి కిందపడిపోయి గాయపడ్డారు. ఆయన్ని ఒక్కసారి నామమాత్రంగా పలకరించి తరువాత ఆయనవైపు సిఎం దృష్టిసారించలేదు. దీంతో సిఎం తరపున మళ్ళీ వస్తారని హామీ ఇచ్చిన శటానిక నేతలు కూడా నిరాశాపడాల్సివచ్చింది. సిఎం తన కార్యక్రమంలో ఎటువంటి మార్పులు చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని భుజానవేసుకుంటానని ప్రకటించిన మంత్రి రఘువీరారెడ్డి కూడా మనస్ఫూర్తిగా పనిచేడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాయకులమధ్య ఉన్న విబేధాలు కాంగ్రెస్ అభ్యర్థికి శాపంగా మారాయి.