గోవా కాంగ్రెస్ లో సంక్షోభం... ఎమ్మెల్యే రాజీనామా...

 

గోవా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోవడంతో కాంగ్రెస్ పై అప్పుడే నేతల్లో అసంతృప్తి భావన మొదలైంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విశ్వజిత్‌ రాణే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గోవా ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిందని రాణే అన్నారు. కాగా గోవాలో 40 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ 17, భాజపా 13 స్థానాలు ఇతరులకు 10 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే బీజేపీ ఇతర పార్టీ నేతల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఇంకెంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడతారో చూద్దాం...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu