జూన్‌ 2 నుండి నవ నిర్మాణ దీక్ష .. చంద్రబాబు

 

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జూన్‌ 2న ఉదయం 11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా జూన్‌ 3 నుంచి 7 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.