భర్త మర్మాంగాలను కోసిన భార్య.. 

ప్రపంచంలో ఏ మతానికైనా మత పెద్దలు ఉంటారు. ఆ మత పెద్దలు ఎవరి వారి మతాల సభ్యులు తప్పులు చేస్తే వారిని సరైన మార్గంలో పెట్టడం ఈ మత పెద్దల పని. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మత పెద్దలు వారి హద్దులు దాటుతున్నారు. ఆదర్శముగా ఉండాలిసిన వాళ్ళు అక్రమ మార్గాలు పడుతున్నారు. మత పెద్దలు అంటే దేవుడితో సమానంగా కొలిచే సమాజం మనది అలాంటిది వాళ్ళే తప్పులు చేస్తే వాటిని సరిదిద్దేవాళ్ళు ఇంకెవరు చెప్పండి. ఇదంతా మీకెందుకు చెపుతున్నాను అనుకుంటున్నారా.  తాజాగా ఓ మత పెద్ద ఒక పని చేశాడు. ఆ పని ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరే చూడండి. 

అతని పేరు అహ్మద్. అతని వయసు 57 సంవత్సరాలు.  అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ తర్వాత కూడా  మూడో పెళ్లికి సిద్దమయ్యాడు. ఆ విషయాన్ని తన ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో ముగ్గురి మధ్య గతకొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇక అంతే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో పాకిస్తాన్ బాంబు పడినట్లు పంచాయితీ మొదలైయింది. రోజులాగే గురువారం రాత్రి కూడా మూడో పెళ్లి విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో అహ్మద్ మొదటి భార్య హజ్రాను బండబూతులు తిట్టాడు, తీవ్రంగా కొట్టాడు. ఆమె కూడా చేసేది ఏమిలేక సైలెంట్ గా ఉండిపోయింది.    రాత్రి అవ్వడం అందరు కలిసి ముగ్గురూ  నిద్రపోయారు. ఇల్లు అంత లైట్స్ బంద్ చేసి ఉన్నాయి. అహమద్ నిద్రలోకి జారుకున్నాడు. భర్త కొట్టిన విషయం మనసులో పెట్టుకున్న హజ్రా కళ్ళు తెరిచింది. వంటింట్లోకి నడిచింది. కూరగాయల కసా కసా కోసే కత్తిని తీసుకుంది, అహ్మద్ పడుకున్న దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా అతను ఆమెతో గొడవ పడిన విషయాలు అన్ని ఫ్లాష్ కట్ లో ఆమె కళ్ళముందు కనిపించాయి. కత్తి తీసుకుని అహ్మద్  మర్మాంగాలను తీవ్రంగా గాయపరిచింది. ఆ కత్తిపోట్లకు తీవ్ర రక్తసావ్రమైన అహ్మద్ ప్రాణాలు విడిచాడు.

ఈరోజు ఉదయం బంధుమిత్రుల సాయంతో అహ్మద్ అంత్యక్రియలు నిర్వహించటానికి సిధ్దమయ్యింది హజ్రా. రోజు వీరు గొడవ పడటం తెలిసిన …చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  భౌరన్ కలాన్ పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టటంతో హజ్రా నేరం ఒప్పుకుంది. ఇద్దరు భార్యల మధ్యే రోజూ గొడవలు జరుగుతూ ఉంటే, మూడో భార్యను తీసుకువస్తాననే సరికి కోపం పట్టలేక ఆవేశంలో హత్యచేశానని తెలిపింది.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.ఈ  ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.