కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

 

కృష్ణా జిల్లా బంటుమిల్లులో టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చిన్న తుమ్మిడి గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ టిడిపి నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడికి వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీనిపై బంటుమిల్లి సీఐ కేసు నమోదు చేశారు. పాత కక్షలతోనే ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారని సీఐ చెప్పారు.

కృష్ణా జిల్లాలో బంటుమిల్లిలో నవంబర్  22న అర్ధరాత్రి వైసీపీ - టీడీపీ వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. చిన్న తుమ్మిడి గ్రామంలో ప్రధానంగా పొలానికి సంబంధించిన వివాదానికి టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీళ్లందరూ టీడీపీ వర్గానికి చెందిన అనుచరులని పోలీసులకు కూడా గుర్తించారు. వైసీపీకి చెందిన అనుచరులు దాడి చేశారని.. టిడిపి నేతలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీనికి సంబంధించి ఫిర్యాదు చేశామన్నారు. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కృష్ణ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి గ్రామాల్లో ఉన్న టీడీపీ వర్గీయులపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.