గుంటూరు అడ్డాగా డ్రగ్స్ దందా.. ఆ వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడని డౌట్!!

 

గుంటూరులో డ్రగ్స్ కలకలం రేగింది. సౌదీ దేశస్తుడు షాజీ నల్లపాడు సమీపం లోని ఓ అపార్టుమెంట్ లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకొని అందులో డ్రగ్స్ తయారు చేస్తూ ఆన్ లైన్ లో అమ్ముతున్నాడు. దీని పై సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్ మెంట్ కి వెళ్లి షాజీని అదుపు లోకి తీసుకున్నారు. షాజీ ఫ్లాట్ లో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు బొమ్మ చేతులు, గ్లౌజులు, ముఖం మాస్కులు దొరికాయి. నిందితుడు ఇక్కడ ఎన్నాళ్ల నుంచి ఉంటున్నాడు? ఎప్పటి నుంచి డ్రగ్స్ తయారు చేసి ఆన్ లైన్ లో అమ్ముతున్నాడు? అనే దానిపై విచారణ జరుపుతున్నారు. అతనికి ఇంకా ఎవరైనా సహకరిస్తున్నారా అని కూడా ఆరా తీస్తున్నారు.

ఇక షాజీ వాడే ఖరీదైన స్పోర్ట్స్ బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి ముందువైపు కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ ప్లేట్ ఉండగా వెనకాల నెంబర్ ప్లేట్ లేదు. అంతేకాదు బైక్ పెట్రోల్ ట్యాంక్ పై జగన్ స్టిక్కర్ అతికించి ఉంది. షాజీ జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే కార్యక్రమాలకు ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దాంతో పోలీసులు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఆయనకు.. షాజీకి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలపై కుపీలాగుతున్నారు.