జానీ మాస్టర్ అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్  గత మూడు రోజులుగా అజ్ఞాతనంలో ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు లో ఉన్నాడని, లేదు విదేశాలకి వెళ్లాడనే ప్రచారం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది.


హైదరాబాద్‌ SOT పోలీసులు బెంగుళూరులో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు.మొత్తం నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా ఈరోజు ఉదయం బెంగుళూరులో దొరికాడు. దీంతో  హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు.ఈ సాయంత్రానికి ఇక్కడకి చేరుకుంటారు. జానీ మాస్టర్ పై  పోక్సో కేసు కూడా నమోదు అయ్యింది.