చిరంజీవి పై కేసు నమోదు

సినీ నటుడు, ఎంపీ చిరంజీవి రెండు రోజుల క్రితం కడపజిల్లా రైల్వే కోడూరులో జరిగిన శ్రీకృష్ణ దేవారాయల విగ్రహావిష్కరణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణ వివాదాస్పదంగా మారింది. నిర్వాహకులు కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకోలేదని, అక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతి లేదంటూ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన 18 మంది నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.