"చిరుదోశ".. రాంచరణ్ గిఫ్ట్

 

చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి తనయుడు రాంచరణ్ దోశను గిఫ్ట్ గా ఇచ్చాడు. రాంచరణ్ ఏంటి దోశ గిఫ్ట్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. చిరంజీవి పుట్టిన రోజుకు వినూత్న పద్దతిలో రాంచరణ్ చిరంజీవికి.. చిరుదోశ పేరిట బహుమతి ఇచ్చాడు. చిరుదోశ ఏంటని అనుకుంటున్నారా అదే చిరంజీవి పేరుతో చిరుదోశ. దీని సంబంధించిన రాంచరణ్ తేజ్ పేటెంట్ రైట్స్ కు దరఖాస్తు చేశారు. అంతేకాదు చిరుదోశకు పేటెంట్‌ వచ్చిన వెంటనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చిరుదోశ లభిస్తుందని రామ్ చరణ్ తెలియచేసారు. దోశలో పల్లీల పచ్చడితో పాటు శాకాహార, మాంసాహార కూరలను కూడా అందివ్వనున్నట్టు.. అంతేగాక తక్కువ ధరకే నాణ్యమైన వంటకాలను కూడా వినియోగదారులకు అందించనున్నట్లు తెలియచేసారు. ఇప్పటి వరకూ దోశల్లో ఎన్నో వైరైటీలు తిని ఉంటాం అయితే ఇక నుండి చిరుదోశ కూడా తినచ్చు.