భద్రాద్రి రామయ్య కు చీరాల భక్తుల నీరాజనం
posted on Mar 25, 2025 12:26PM

పది టన్నుల వడ్లు గోటితో వలిచారు
భద్రాద్రి రాముడి కల్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది.
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణం మహోత్సవానికి అన్నీ తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు నిర్వాహకుడు పొత్తూరి బాలకేశవులు.