రామచంద్రపురం నచ్చేసిందన్న సిఎం!

తనకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం బాగా నచ్చేసిందని రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ద్రాక్షారామలో మాట్లాడుతూ తాను ముందుగా ఊహించినట్లే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తెలివైన వారని నిరూపించుకున్నారని కొనియాడారు. మాజీమంత్రి, వై.కా.పా. అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఓటమి కోసమే ఈ ఎన్నికలు వచ్చాయని తన ఎన్నికల ప్రచారంలో అన్నమాటను సిఎం గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించటం ద్వారా నియోజకవర్గ ప్రజలు కోరినవన్నీ తీరుస్తానని మాట ఇచ్చారు. ముందస్తుగా ఒక ఐటిఐను, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేశారు.

 

రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీరుస్తామన్నారు. గంగవరం మండలంలో జూనియర్‌ కాలేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఎస్సీ ఆశ్రమపాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అడిగిన ప్రతీ ఒక్క అంశానికీ సిఎం ఆమోదముద్ర లభించింది. సిఎం వైఖరిని గమనిస్తే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు మంత్రిపదవి కూడా ఇదే స్పీడులో ఇచ్చేస్తారన్న అభిప్రాయం కూడా స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులకు ఏర్పడిరది. ఇంకోసారి నియోజకవర్గానికి వస్తానని సిఎం చెబుతూ కిందకి దిగుతున్నప్పుడు మా తోటకు మంత్రిపదవి ఇచ్చాక అని కొందరు వ్యాఖ్యానించటం చెవిన పడ్డా చిరునవ్వుతో సిఎం బయలుదేరి వెళ్లిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu