ఫామ్ హౌస్ రాజకీయాలు మొదలుపెట్టిన చంద్రబాబు!

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏపీలో ఉంటున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేస్తున్నారు. అమరావతిలో ఉండే పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఏపిలో పార్టీ పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చిస్తున్నారు. ఏపీలో పార్టీని మళ్ళీ పట్టాల పైకి తీసుకొచ్చే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. సోమవారం నుంచి శుక్రవారం ఏపీ పనులే చూస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే శుక్రవారం చలో హైదరాబాద్ అంటున్నారు. గన్నవరం టు హైదరాబాద్ ఫ్లయిట్ ఎక్కేస్తున్నారు. హైదరాబాద్ లో రెండు రోజులు ఉంటున్నారు. 

మొన్నటిదాకా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వచ్చి తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమయ్యేవారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించేవారు. అయితే రెండు వారాలుగా చంద్రబాబు షెడ్యూల్లో మార్పు వచ్చింది. వీకెండ్ లో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారని పలువురు ఆరా తీస్తున్నారు. శని ఆదివారాలూ చంద్రబాబు హైదరాబాద్ హఫీజ్ పేట లోని ఫామ్ హౌస్ కు పరిమితమవుతున్నారు. అక్కడే ఆయనని కావలసిన వాళ్ళని కలుస్తున్నారు. అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు వీకెండ్ ఫాంహౌస్ మీటింగ్ లు చర్చనియాంశంగా మారాయి. అయితే తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగా లేదు. హుజూర్ నగర్ లో పోటీ తరువాత ఇంకా దిగజారింది. దీంతో మళ్లీ ఇక్కడ పార్టీ పై దృష్టి పెట్టారు చంద్రబాబు. అధికార పార్టీతో శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు అనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడం లేదంటున్నారు. ఇక్కడి పార్టీ వ్యవహారాల్లో పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. హైదరాబాదులో తిరిగి గుడ్ రిలేషన్స్ ను సంపాదించుకోవడంలో భాగంగానే చంద్రబాబు ఫామ్ హౌస్ కు పరిమితమవుతున్నారని అంటున్నారు.