వివాహేతర సంబంధాన్ని నేరం అనలేం: కోర్టు

స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం అనలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వివాహేతర సంబంధాన్ని నేరం అనలేమని చెప్పింది. వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధం వుండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.  కోర్టు ఈ వ్యాఖ్యలను ఒక కేసు విషయంతో తీర్పు ఇస్తూ చేసింది. ఒక మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే ఆ వ్యక్తి తనకు పెళ్ళి అయిన విషయం దాచి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ కోర్టు మెట్లు ఎక్కింది. అతనితో శారీరక సంబంధాన్ని ఇష్టపూర్వకంగానే కొనసాగించి, అతనికి ముందే పెళ్ళయింది కాబట్టి తనను నమ్మించి మోసం చేశాడని అనడంలో అర్థం లేదని జస్టిస్ అమిత్ మహాజన్ స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి లొంగదీసుకున్నాడని చెప్పినప్పటికీ దీన్ని నేరంగా పరిగణించలేమని అన్నారు.